4 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్‌.. దక్షిణాఫ్రికా 204 ఆలౌట్

  • సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా చివరి వన్డే
  • ధాటిగా ఆడలేకపోయిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌
  • జోండో 54, డివిల్లియర్స్ 30
  • శార్దూల్ ఠాకూర్‌కి 4 వికెట్లు
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరుగుతోన్న చివరి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆరో వన్డేలోనూ ధాటిగా ఆడలేకపోయారు. 46.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. మార్క్‌రమ్ 24, ఆమ్లా 10, డివిల్లియర్స్ 30, జోండో 54, క్లాసేన్ 22, బెహర్డైన్ 1, మార్రీస్ 4, ఫెహ్లుక్వాయో 34, మార్కెల్ 20, తాహిర్ 2 , ఎన్గిడి 0 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకుర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక బుమ్రా, చాహెల్‌లకి రెండేసి వికెట్లు దక్కగా, పాండ్యా, కుల్‌దీప్‌ యాదవ్‌లు చెరో వికెట్ తీశారు.  
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News